తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

NRPT: నారాయణపేట జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న వివిధ దస్త్రాలను పరిశీలించారు. భూభారతి దరఖాస్తులను గురించి తహసీల్దార్ అమరేంద్ర కృష్ణను అడిగి తెలుసుకున్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. కార్యాలయంలో నిల్వ ఉన్న ఫైళ్లను తొలగించాలన్నారు.