చౌకదుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన MRO

చౌకదుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన MRO

TPT: డక్కలి మండలంలోని పలు చౌకదుకాణాలపై మంగళవారం MRO శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వెల్లంపల్లి, వెంకటేశ్వరపురం, పంటవారిపల్లి, కమ్మపల్లి గ్రామాల్లోని రేషన్ దుకాణాలను ఆయన పరిశీలించారు. రేషన్ సరుకుల నిల్వలు, ప్రతి నెల సక్రమంగా అందుతున్నాయా అని వినియోగదారుల వద్ద ఆరా తీశారు. రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని MRO హెచ్చరించారు.