గోవింద ఆధ్యాత్మిక గీతాలతో అంతర్వేదికి పాదయాత్ర

గోవింద ఆధ్యాత్మిక గీతాలతో అంతర్వేదికి పాదయాత్ర

కోనసీమ: జిల్లాలో పుణ్యక్షేత్రమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. చించినాడకు చెందిన సుమారు 260 మంది భక్తుల బృందం గోవింద నామస్మరణ చేస్తూ కాలినడకన క్షేత్రానికి చేరుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరిన ఈ బృందం, 30 కిలోమీటర్ల మేర ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ మధ్యాహ్నం 3 గంటలకు ఆలయానికి చేరుకుంది.