VIDEO: ఆర్టీసీ బస్సులో మంటలు

HYD: మెహిదీపట్నం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్డినరీ బస్సుకు మరమత్తులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.