సుధీర్ రెడ్డితో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే భేటీ

KDP: జమ్మలమడుగు నియోజకవర్గం లోని స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో జమ్మలమడుగు మాజీ శాసన సభ్యులు డా.సుధీర్ రెడ్డిని బుధవారం పుట్టపర్తి మాజీ శాసన సభ్యులు దిద్దికుంట శ్రీధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలు గురించి సుధీర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డిలు చర్చించుకున్నారు.