మేడారం గద్దెల వద్ద ప్రమాదాలు: ఇద్దరు భక్తులకు గాయాలు

మేడారం గద్దెల వద్ద ప్రమాదాలు: ఇద్దరు భక్తులకు గాయాలు

MLG: మేడారం వనదేవతల గద్దెల వద్ద ఆదివారం భక్తుల రద్దీ పెరగడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గ్రిల్స్ బయట నుంచి కొబ్బరికాయలు, బెల్లం ముద్దలు విసిరిన క్రమంలో నిజామాబాద్‌కు చెందిన స్వప్న తలకు తీవ్ర గాయం కాగా, ఖమ్మంకు చెందిన గోపి అస్వస్థతతో కుప్పకూలి గాయపడ్డాడు. ఇద్దరికీ ప్రథమ చికిత్స అందించి ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.