నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్
కాకినాడ కలెక్టరేట్లోని సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గం.ల నుంచి మధ్యాహ్నం 1గం వరకు సమస్యలపై వినతులను స్వీకరిస్తామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులంతా విధిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.