డయాబెటిస్ వల్ల కీళ్ల సమస్య వస్తుందా?
డయాబెటిస్ ఉన్న వారు తీవ్రమైన కీళ్ల సమస్యను ఎదర్కోవచ్చు. న్యూరోపతి (నరాలు దెబ్బతినడం), రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల కూడా ఇది సంభవిస్తుంది. పాదాల ఎముకలు బలహీనపడి విరిగిపోయే ప్రమాదం ఉంది. వైకల్యం ఏర్పడుతుంది. కీళ్లలో తిమ్మిరి, జలదరింపును కలిగిస్తుంది. చక్కెర స్థాయిలు నియంత్రణలో లేనివారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారికి ఈ ప్రమాదం ఉంటుంది.