బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా రత్నయ్య
MDCL: జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది తుర్కపల్లి రత్నయ్య 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా హరికృష్ణ, ప్రసన్న, ప్రధాన కార్యదర్శిగా దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా రవిశంకర్, జలజ ఎన్నికయ్యారు. ఇతర కీలక బాధ్యతల్లో సాయినాథ్ గౌడ్, పవన్ కుమార్, సుజాత, నవనీత సహా పలువురు విజయం సాధించారు. నిన్న జరిగిన ఎన్నికల ఫలితాలను ఇవాళ వెల్లడించారు.