సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
SDPT: ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పేదలకు వరం లాంటిదని బి.జి.వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ పరమేశ్వర్ అన్నారు. శనివారం గ్రామంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి సహకారంతో మంజూరైన రూ. 12,000 విలువైన CMRF చెక్కును లబ్ధిదారురాలు నాగపూరి హన్వికకు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నపేద కుటుంబాలకు ఈనిధి ఒక 'అభయహస్తం' అని పేర్కొన్నారు.