పాల్వంచలో కర్రలతో దాడి.. కేసు నమోదు

పాల్వంచలో కర్రలతో దాడి.. కేసు నమోదు

BDK: పాల్వంచలోని ములకలపల్లికి చెందిన వేముల దుర్గారావు(35)పై బత్తుల అంజి,అతని అనుచరులు గురువారం దారుణంగా కర్రలతో దాడి చేశారు. దుర్గారావు శనివారం మాట్లాడుతూ.. గత ఏడాది నుండి తన భార్య తన పుట్టింట్లోనే ఉంటోందని, ఆమె తరపున తనపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి తాను, తన అన్నదమ్ములు జైలుకుపోయినట్లు తెలిపారు. దాడిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.