నేడు శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు ప్రారంభం
SKLM: జిల్లా చరిత్రలో 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు సర్వీస్ సోమవారం ప్రారంభం కానుంది. సోమవారం మ. 3.కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ రైలును ప్రారంభించనున్నారు. 17439/40 హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.