ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

NRPT: మాగనూరు మండలం వాడ్వాట్లో అడవి సత్యారం గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కనే, జనావాసాలకు దగ్గరగా, చేతికి అందే ఎత్తులో ఫెన్సింగ్ కూడా లేకుండా ఈ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దీని వల్ల రైతులు, పిల్లలు, పశువులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.