హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు అవగాహన
కృష్ణా: గుడివాడ పెద్ద కాలువ సెంటర్లో ట్రాఫిక్ ఎస్సై నాగరాజు వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై అన్నారు. హెల్మెట్ ధరించడం ప్రమాద సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.