అస్తవ్యస్తంగా మారిన ఆచంట బైపాస్ రోడ్డు

W.G: ఆచంటలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి పోలీస్ స్టేషన్ నుంచి సంత మార్కెట్ సెంటర్ వరకు విస్తరించిన బైపాస్ రోడ్డు అధ్వానంగా మారింది. ఆ రోడ్డుపై ఉన్న గోతులతో నీరు నిండి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఇదే రహదారిలో వందలాది వాహనాలలో ప్రయాణిస్తూ ఉంటారు. అధికారులు స్పందించి, మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.