ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి
NZB: మాక్లూర్ మండలానికి చెందిన బోర్లం కె గ్రామానికి చెందిన గంగాధర్(51) బాల్కొండ మాణిక్ బండార్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్ధలానికి చేరుకుని అంబులెన్స్ కు ఫోన్ చేసి, మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.