రేషన్ షాపుల వద్ద పండుగ వాతావరణం: ఎమ్మెల్యే

MBNR: ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు రేషన్ షాపుల దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎదిరలో వరిధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో రూ.13వేల కోట్లు ఖర్చుచేసి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నడంతో లబ్ధిదారులు 100% బియ్యాన్ని తీసుకుంటున్నారన్నారు.