ఐఎఫ్‌ఆర్-2026 ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

ఐఎఫ్‌ఆర్-2026 ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

విశాఖలో జరగనున్న ఐఎఫ్‌ఆర్-2026, సిటీ పరేడ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులతో కలిసి కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఏర్పాట్లను సమీక్షించారు. వీఐపీ సిట్టింగ్, బారికేడింగ్, క్యూలైన్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, పార్కింగ్, కంట్రోల్‌రూమ్ వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.