గ్రేటర్‌లో టీ-24 టికెట్ ధర పెంపు

గ్రేటర్‌లో టీ-24 టికెట్ ధర పెంపు

TG: గ్రేటర్ హైదరాబాద్‌లో RTC టీ-24 టికెట్ ధరను పెంచింది. ఇదివరకు రూ.130 ఉన్న టికెట్ ధర నిన్నటి నుంచి రూ.150కి చేరింది. అలాగే, సీనియర్ సిటిజన్లకు రూ.110 ఉన్న టికెట్ రూ.120కి మార్చింది. పిల్లలకు రూ.90 ఉండగా, రూ.100 చేశారు. స్టూడెంట్‌ బస్ పాస్‌, జనరల్‌ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ.. టీ24 టికెట్‌ ధరలు పెంచడంతో ఆర్టీసీ ప్రయాణం సామాన్యులు భారంగా మారింది.