వంజంగి మేఘాలకొండను సందర్శించిన కలెక్టర్
ASR: వంజంగి మేఘాలకొండ అందాలను కలెక్టర్ దినేశ్ కుమార్ ఆస్వాదించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇవాళ తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో వంజంగి కొండపైకి చేరుకున్నారు. మంచు మేఘాలను చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయ కిరణాలు, మంచు మేఘాల అందాలను వారు తిలకించారు. రెండు రోజుల సెలవులు ఉండటంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వంజంగిలో సందడి చేస్తున్నారు.