VIDEO: 'మార్కెట్‌కు ఆరబెట్టిన మొక్కజొన్నలు తీసుకురావాలి'
WGL: నెక్కొండ వ్యవసాయ మార్కెట్‌కు మొక్కజొన్నలు తీసుకువచ్చే రైతులు తమ ఇళ్ల వద్దే పూర్తిగా ఆరబెట్టి తీసుకురావాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ రావుల హరీష్ రెడ్డి ఇవాళ తెలిపారు. పచ్చి మొక్కజొన్నలను మార్కెట్‌కు తీసుకువచ్చి అక్కడే ఆరబెట్టడం వల్ల స్థలం సమస్యలు,ఇబ్బందులు ఏర్పడతాయి. ఆరబెట్టిన మొక్కజొన్నలను తీసుకువస్తే అదే రోజు విక్రయాలు పూర్తి చేస్తామన్నారు.