పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి: CPM

పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి: CPM

NDL: రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆత్మకూరులో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద రోగులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న, సేవలు పునరుద్ధరించకపోవడం హాస్యాస్పదమని విమర్శించారు. బకాయిలు రూ. 300 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు.