VIDEO: రైతుల పొలాల్లో దొంగల బీభత్సం
HNK: ఐనవోలు మండలం కొండపర్తి రైతుల వ్యవసాయ పోలాల వద్ద వ్యవసాయ పొలాల్లో ఇవాళ దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తుతెలియని దుండగులు దాదాపు 15 మంది రైతులకు చెందిన బోర్ల ఫ్యూజ్‌లు, మోటార్ వైర్లు అలాగే మూడు బావుల మోటార్లు, వైర్లు దొంగిలించి పరారయ్యారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.