శంకర్ గౌడ్ మృతిపై ఆర్టీసీ కార్మికుల మౌన ప్రదర్శన
SDPT: నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమను కలిచివేసిందని సిద్దిపేట ఆర్టీసీ కార్మిక JAC, నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు సిద్దిపేట బస్ డిపో నుంచి మోడ్రన్ బస్ స్టాండ్ వరకు నోటికి నల్ల గుడ్డ కట్టుకొని మౌన ప్రదర్శన, ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు.