నియోజవర్గంలో రేపు ఎమ్మెల్యే పర్యటన
NLR: కోవూరు నియోజవర్గంలో రేపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. విడవలూరు మండలంలోని పార్లపల్లి గ్రామంలో ఉదయం వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారని, సాయంత్రం నాలుగున్నర గంటలకు కొడవలూరు మండలం రేగడి చెలిక గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్‌లు ప్రారంభిస్తారని ఆమె కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.