కంభంపాడు, పరస గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది'
PLD: పెదకూరపాడు(M) కభంపాడు, పరస గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. AO క్రిష్ణయ్య రబీ శనగ, మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించారు. శనగలో ఎండు తెగులు నివారణకు kg విత్తనానికి 8-10 గ్రాముల ట్రికోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేయాలన్నారు. విల్ట్ ఎన్బీజీ 776 సాగు చేయాలన్నారు. తెగులు ఉదృతిగా ఉన్న జొన్న పంటలతో పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు.