గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
CTR: బైరెడ్డిపల్లి పుంగనూరు రోడ్డు సమీపంలో 300 గ్రాముల గంజాయి తరలిస్తుండగా బాబు, రఫీ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తహసీల్దార్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై చందనప్రియ తన సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు. నిందితులపై కేసు నమోదు చేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు. మండలంలో గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.