ఇందిరమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

ఇందిరమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన  కాంగ్రెస్ నేతలు

MHBD: కొత్తగూడ మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఇవాళ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధ్యక్షుడు సారయ్య మాట్లాడుతూ.. గరీబులకు భూపంపిణీ, బ్యాంకుల జాతీయీకరణ, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ఇందిరమ్మను కొనియాడారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఆమె స్ఫూర్తితో మహిళలకు ఉచిత బస్సు, రుణాలు కల్పిస్తోందని పేర్కొన్నారు.