రూ.10కే తిన్నంత బిర్యానీ.. ఎక్కడంటే?

AP: తూర్పుగోదావరి జిల్లా విరవల్లి టోల్ ప్లాజా వద్ద అన్‌లిమిటెడ్ హోటల్ ఉంది. హోటల్ నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు స్పెషల్ ఆఫర్ పెట్టారు. రూ.10కే తిన్నంత బిర్యానీ అని ప్రకటించారు. దీంతో జనం హోటల్‌కు బారులుతీరారు. బిర్యానీ ప్రియులు భారీగా ఎగబడటంతో గంటలోనే బిర్యానీ గిన్నెలు ఖాళీ అయ్యాయి. అయితే, ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందని హోటల్ నిర్వాహకులు తెలపలేదు.