నిమ్స్‌లో లీనాక్ సేవలను ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్‌లోని నిమ్స్ క్యాన్సర్ బ్లాక్‌లో సుమారు రూ. 33 కోట్లలతో లీనాక్ సేవలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం ప్రారంభించారు. దీంతో, TrueBeam సిస్టమ్ ద్వారా ట్యూమర్‌పై మాత్రమే ప్రభావం చూపించే ఖచ్చితమైన రేడియేషన్ చికిత్స ఇప్పుడు పేద రోగులకూ అందుబాటులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం, తదితరులు ఉన్నారు.