నేడు జిల్లా వ్యాప్తంగా సీఎం జన్మదిన వేడుకలు
నెల్లూరు: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నట్లు టీడీపీ కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.