VIDEO: రాజ్యాంగ నిర్మాత ఆశయాలే మనకు స్ఫూర్తి: కలెక్టర్
కోనసీమ: అమలాపురం కలెక్టరేట్‌లో బీ.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. కలెక్టర్ మహేష్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఒక వర్గానికో, ప్రాంతానికో పరిమితం కాదని, కుల వివక్ష నిర్మూలన, స్త్రీ సాధికారత కోసం కృషి చేసిన ప్రపంచ స్థాయి మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తదితరులు పాల్గొన్నారు.