పిడమర్తి బాబురావుకు 'దళిత రత్న' పురస్కారం

పిడమర్తి బాబురావుకు 'దళిత రత్న' పురస్కారం

SRPT: కోదాడకి చెందిన పిడమర్తి బాబురావు ప్రతిష్టాత్మక 'దళిత రత్న' అవార్డు అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కమిటీ ప్రతినిధుల చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మలిదశ ఉద్యమంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.