చిలకలూరిపేటలో వీధికుక్కల బీభత్సం.. 15 మందిపై దాడి

చిలకలూరిపేటలో వీధికుక్కల బీభత్సం.. 15 మందిపై దాడి

PLD: చిలకలూరిపేటలో సోమవారం పిచ్చికుక్క స్వైరవిహారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రూత్ డైక్ మెన్ కాలనీ, బాలాజీ థియేటర్, గుర్రాల సావిడి ప్రాంతాల్లో ఒక పిచ్చికుక్క దాడి చేయడంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.