'గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలి'
WNP: జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయానికి చదువుకోడానికి వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టర్ పట్టణంలోని గ్రంథాలయాన్ని సందర్శించి, అక్కడ భవనంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రంథాలయంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చర్చించారు.