ఆ టీచర్ల నియామకాలు చెల్లుతాయి: హైకోర్టు
పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో కోల్‌కతా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 32 వేల ప్రైమరీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని చెప్పింది. నియామకాల రద్దు వల్ల వారి కుటుంబాలు ప్రతికూల ప్రభావం పడొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.