జిల్లాలో భానుడు భగ..భగ..

జిల్లాలో భానుడు భగ..భగ..

ఖమ్మం జిల్లాలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. ఆదివారం కల్లూరు, కొణిజర్ల మండలాల్లో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధిర, రఘునాథపాలెం, ఖమ్మం నగరంలోనూ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయి. సాధారణం కంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం వేళ జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. వేడి గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.