చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్పీ

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్పీ

ప్రకాశం జిల్లా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో, ప్రజల దాహార్తిని తీర్చేందుకే ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.