'పాఠశాలల వద్ద పోలీసు ఫికెటింగ్ నిర్వహించాలి'

MBNR: ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేసి ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని.. లైంగిక దాడులకు పాల్పడే అల్లరి మూకలపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రం గద్వాలలోని దళిత ఐక్యవేదిక కార్యాలయంలో ఆయన దళిత సంఘాల నాయకులతో కలిసి సమావేశం నిర్వహించి మాట్లాడారు.