అకాల వర్షం.. తీవ్రంగా దెబ్బతిన్న పంట
NLG: రామునిగుండ్ల తండాలో నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా వరి పంట తీవ్రంగా దెబ్బతింది. చేతికొచ్చిన పంట నేలపాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో నీరు నిలిచి ధాన్యం రాలిపోవడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరానికి రూ. 40,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.