కలెక్టర్ హనుమంతరావు హెచ్చరిక
BHNG: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం ద్వారా దక్కించుకోవాలని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతురావు హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలన్నారు. జిల్లాలో వేలం పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల వేలం నిర్వహించినా, ప్రయత్నించినా టోల్ ఫ్రీ నంబర్ 8978928637కు సమాచారం ఇవ్వాలన్నారు.