గ్రామంలో సుపరిపాలన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి గ్రామంలో సోమవారం జరిగిన 'సుపరిపాలన తొలిఅడుగు' కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. అన్ని హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతల పాల్గొన్నారు.