నత్త నడకన రోడ్డు పనులు.. తరచూ ప్రమాదాలు

నత్త నడకన రోడ్డు పనులు.. తరచూ ప్రమాదాలు

VKB: మహబూబ్‌నగర్-చించోలి హై వే రోడ్డు పనులు నత్తనడకలా సాగుతున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. శనివారం మహబూబ్‌నగర్ నుంచి కొడంగల్ వైపు వస్తున్న కారు కోస్గి రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.