'చట్ట సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కావాలి'

'చట్ట సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కావాలి'

MBNR: కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చింది కాని ఏ హామీ ఇప్పటివరకు అమలు చేయలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొని మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఏదో చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం నటించిందన్నారు.