VIDEO: చలివేంద్రాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్

VIDEO: చలివేంద్రాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్

కృష్ణా: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ నవీన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.