'రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'
W.G: పాలకోడేరులో సోమవారం రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా సీఎం లేఖను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. రైతులందరికీ స్వయంగా ఆయన చేతులతో లేఖను అందజేశారు. రైతాంగం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి భద్రత, ఆధారిత వ్యవసాయం, సాంకేతికత వ్యవసాయం, ఆహార సంస్కరణ, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలను రైతులకు వివరించారు.