పెరుగుతున్న చలి తీవ్రత

పెరుగుతున్న చలి తీవ్రత

AP: అల్లూరి జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోతున్నాయి. అరకు ఏజెన్సీలోని దళపతి గూడెంలో 3.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. డుంబ్రిగూడ, జి.మాడుగులలో 3.9, హుకుంపేట, ముంచింగి పుట్టులలో 4.8, పాడేరు 4.8, పెదబయలు 6.1 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ నెల 13 వరకు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.