VIDEO: యువత క్రీడా ప్రతిభకు సీఎం కప్ సువర్ణావకాశం
ములుగు జిల్లా కేంద్రంలో గ్రామీణ యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశమని జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 44 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విద్యార్థుల ర్యాలీకి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.