రాచర్లలో ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు
ప్రకాశం: రాచర్లలోని కంభం గిద్దలూరు హైవే రహదారిపై ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం ప్రమాద నియంత్రణ చర్యలు చేపట్టారు. మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ మూల మలుపు వద్ద రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ప్రాంతాలని గుర్తించి కన్వెన్స్ మిర్రర్స్ ఏర్పాటు చేశారు. ఈ దర్పణాలు వాహనదారులకు ప్రమాదాలను నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్సై పేర్కొన్నారు.