కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసిన ఎంపీ
CTR: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఆపాలని వైసీపీ ఎంపీలు కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను బుధవారం వైసీపీల ఎంపీల బృందం కలిశారు. ఈ క్రమంలోని ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. కళాశాలల ప్రైవేటీకరణలో జోక్యం చేసుకొని ఆపాలని విన్నవించారు.